![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -320 లో.... మమ్మల్ని క్షమించావ్ అది చాలు అని సందీప్ అనగానే.. ఎవరు మిమ్మల్ని క్షమించింది మిమ్మల్ని ఎప్పటికి క్షమించనని సీతాకాంత్ అనగానే.. అందరు షాక్ అవుతారు. మరి ఏంటి మిమ్మల్ని ఎప్పుడో క్షేమించాను.. ఇక జరిగింది అంత అందరు మర్చిపోండి అంటూ సీతాకాంత్ అందరి దగ్గర మాట తీసుకుంటాడు . శ్రీలత అందరికి వంట చేస్తుంది. అందరూ బాగుంది అంటూ తింటు ఉంటారు. అప్పుడే రామలక్ష్మికి ఫోన్ వస్తుంది. దాంతో ఫోన్ తీసుకొని పక్కకి వస్తుంది. ఏంటి స్వామి అంటూ మాట్లాడుతుంది. స్వామి రమ్మని చెప్పడంతో రామలక్ష్మి వెళ్తుంది.
రామలక్ష్మి స్వామి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. మీకు ప్రమాదం మొదలైందని చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. దానికి పరిష్కారం చెప్పండి అని రామలక్ష్మి అడుగగా.. నీ భర్తని నువ్వు కాపాడుకోవాలి.. శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఇక మరింత జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్తాడు. మరొకవైపు సిరికి ధన ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటాడు. ఇంకా చాలు అంటుంటే ప్రేమగా కోసిరి కోసిరి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే సీతాకాంత్ జ్యూస్ తీసుకొని వస్తాడు. పైన సందీప్ ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా పూలకుండికి తాకిస్తాడు. దాంతో అది సీతాకాంత్ పై పడిపోబుతుంటే సీతాకాంత్ ని పక్కకి లాగుతుంది శ్రీలత. అదంతా రామలక్ష్మి చూస్తుంది.సందీప్ త్వరగా వచ్చి అన్నయ్య నేను చూసుకులేదంటూ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తాడు.
ఇదే అతి వినయం వద్దని చెప్పాను.. మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారని రామలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. మీరు మారలేదు అంటుంటే వాళ్ళు మారారు. నువ్వు అలా అపార్ధం చేసుకొకని సీతాకాంత్ అంటాడు. నేను నిజంగానే మారాను అమ్మ అంటూ శ్రీలత ఏడుస్తు వెళ్ళిపోతుంది. అమ్మ మారిపోయిందని సిరి, శ్రీవల్లిలు అంటుంటే రామలక్ష్మి ఎటు తేల్చుకోలేకపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |